Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
- జయంత్ చౌదరిపై అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ స్పందన
- జయంత్, ఆయన భార్య తనకు బాగా తెలుసని ఒవైసీ వ్యాఖ్య
- యూపీలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదన్న ఒవైసీ
- బీజేపీని అడ్డుకోవాలనుకునే పార్టీలు తమతో మాట్లాడవచ్చని ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) నేత కేంద్రమంత్రి జయంత్ చౌదరిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ‘‘మేము పావు రూపాయిన ఒక రూపాయిగా మార్చాము, అయినా మీరు మమ్మల్ని వదిలేశారు’’ అని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ జయంత్ చౌదరికి మద్దతుగా నిలిచారు. ‘‘నాకు జయంత్ చౌదరి, ఆయన భార్య గురించి బాగా తెలుసు. అలాంటి ప్రకటన పూర్తిగా అబద్ధం. అలాంటి ప్రకటన చేయడం ద్వారా, మీరు మీ ఆలోచనా విధానాన్ని, మనస్తత్వాన్ని ప్రపంచానికి వెల్లడించారు’’ అని ఓవైసీ అఖిలేష్‌ను విమర్శించారు.
తాను జయంత్ చౌదరిని ఇప్పటికీ కలుస్తుంటానని, మీరు ఎందుకు బీజేపీలో చేరారు? అని అడిగానని, దానికి ఆయన నవ్వుతూ.. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అనే వారిని ఓవైసీ అన్నారు. మా మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, మేము వారిని గౌరవిస్తామని, అది మీ మనస్తత్వాన్ని భయపెడుతోందని అఖిలేష్‌పై ఓవైసీ మండిపడ్డారు.
Also Read
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల పొత్తులపై ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తర్ ప్రదేశ్‌లో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం తాము కోరుకోవడం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎవరికైనా ఇష్టం లేకపోతే, బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. వారు మాతో మాట్లాడవచ్చు. మీరు ఒక్కరే బీజేపీని ఆపలేరనే విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ’’ అని ఓవైసీ అన్నారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై కూడా ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎలాంటి కుటుంబ వారసత్వం లేకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించుకుని, స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్దిమంది నాయకుల్లో మాయావతి ఒకరని అన్నారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, అదే స్థాయి రాజకీయం మళ్లీ సాధ్యమవుతుందా? అనేది వేరే విషయమని ఓవైసీ చెప్పారు.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!