రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖ వనరులు, అవకాశాలను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఆలస్యం అయినా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన ఇన్వెస్టర్లను ఆకర్షించిందని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దసరా పండగ నుంచి విశాఖ నుంచే పరిపాలన చేయాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. దీంతో విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి లాంటి వాటి కోసం త్రీమెన్ కమిటీని సీఎస్ జవహార్ రెడ్డి నియమించారు.
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
ఏపీలో మళ్ళీ మూడురాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికల హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 26జిల్లాలు ఏవిధంగా వచ్చాయో….మూడు రాజధానులు అదే విధంగా వస్తాయన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవ్వడం ఖాయం అని ధీమాగా చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు ఊహలు, అయోమయంలో ఉంటారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో…!? వ్యతిరేకమో చెప్పాలన్నారు. చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగానే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. సీఎంకు గిరిజనులపై…
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ప్రభుత్వం బిల్లుని ఉపసంహరించుకోవడం… మళ్ళీ సమగ్రంగా బిల్లుని ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో రాష్ర్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజధానుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా విశాఖ పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు కుట్ర చేసారు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది. అమరావతి రైతులు అర్ధం చేసుకోవాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేతలో.. ప్రతిపక్ష నేతలో.. ఈ విషయంపై తరచూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాలన కొనసాగించాలని అధికార వైసీపీ వేగంగా ప్రయత్నాలు చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.. ఇక, ఈ మధ్య మళ్లీ తరచూ విశాఖ రాజధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేతలు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…