ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతోంది. మూడురాజధానుల పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని తెలిపింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది ఏపీ ప్రభుత్వం. ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ.
Read Also: Astrology: జనవరి 31, మంగళవారం దినఫలాలు
పిటిషన్ దాఖలు చేశారు మస్తాన్ వలీ తరపు న్యాయవాది శ్రీధర్ రెడ్డి. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని సూచించింది శివ రామకృష్ణ కమిటీ. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ రెండు పిటిషన్లు కలిపి విచారించనుంది సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంపై ఏం జరుగుతుందనేది ఉత్కంఠను రేపుతోంది. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఈ పిటీషన్లపై తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీన విచారిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. ఆ టైం రానేవచ్చింది. సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది, అమరావతి భవిష్యత్ ఏంటనేది ఉత్కంఠను రేపుతోంది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. గతంలో చేపట్టిన విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. మూడురాజధానుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Read Also: Anam Ramnarayana Reddy: వెంకటగిరిలో హాట్ పాలిటిక్స్..క్యాడర్ తో ఆనం భేటీలు