ఏపీ పాలనా వ్యవహారాల్లో కొత్త మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజా పరిణామలను పరిశీలిస్తే వాస్తవం అర్ధం అవుతుంది. తనకు అత్యంత విధేయుడిగా వుండే డీజీపీ గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేయడం సంచలనం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు వేయడం వెనుక ఏం జరిగిందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గౌతమ్ సవాంగ్ ని మారుస్తారని ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం తర్వాత వార్తలు వచ్చాయి. అవి…