కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. CRPFలో 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రతిష్టాత్మకమైన అగ్నిపథ్ పథకానికి అనుగుణంగా సరిహద్దు భద్రతా దళంలో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులతో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.