Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. దీంతో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకున్నారు. వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. సామాగ్రిని తీసుకుని ఇవాళ సాయంత్రంలోగా సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి…
2024 Lok Sabha elections: 2024 లోకసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలను ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) కొత్తగా 8.92 లక్షల కొత్త వీవీపాట్ మెషీన్‌లకు ఆర్డర్ చేసింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVMలు) తప్పుగా ఉన్నాయనే ఆందోళనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని, రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా సాధారణంగా ఈవీఎం యంత్రాలనే వాడతారు. ఓటరు తమ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరమే ఈవీఎం. ఎవరైనా ఓటేయాలంటే దీనిని వినియోగించుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికల్లో ఎందుకు వినియోగించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా?.
తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టే తిరుగుతోంది. సహజంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ బైపోల్ నిర్వహణలో ఈవీఎంలను ఉపయోగిస్తారా? లేదంటే బ్యాలెట్ పద్దతా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..తమ డిమాండ్లు హైలైట్ అయ్యేలా వివిద వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు,…