EVM: ఈసారి ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు పలుమార్లు ఆరోపణలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి…
Loksabha Elections : ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ, ఒడిశాలోని పూరీ సీటుకు సంబంధించిన అన్ని స్థానాల్లో ఓటింగ్ సమయంలో ఈవీఎంలు చెడిపోయినట్లు సమాచారం.
మాచర్ల సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముకేష్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు పంపింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం సంఘటనపై ఏపీ సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ అడిగింది.
మధ్యప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల జరిగిన మూడో దశ పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉంచే వీవీప్యాట్‌ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వందశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.
Supreme Court: ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమని సుప్రీం పేర్కొంది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా ఎంపీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు.
Sam Pitroda : రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అయిన ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా ఈవీఎంలపై సంచలన ప్రకటనలు చేశారు. త్వరలో అంతర్జాతీయ నిపుణులతో దానిని బహిర్గతం చేయబోతున్నారని పేర్కొన్నారు.
EVM’s Not Working in Telangana State: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో…