ప్రముఖ కంప్యూటర్, మొబల్ ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నది. యాపిల్ అటోనమస్ పేరుతో ఈ కారును తయారు చేసింది. భారత సంతతికి చెందిన దేవాంగ బొర అనే మెకానికల్ ఇంజనీర్ ఈ కారును డిజైన్ చేశారు. పెద్దని గుండ్రంగా ఉన్న గోళం దానికి నాలుగు చక్రాలు ఉన్న అటోనమస్ చూసేందుకు అచ్చంగా పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ కారుకు డ్రైవర్ అవసరం లేదు.…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. కొత్త కొత్త వాహానాలు అందుబాటులోకి రావడంతో ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, భారత్‌కు చెందిన వార్డ్ విజార్డ్ సంస్థ రెండు ఎలక్ట్రిక్ వాహనాలను విపణిలోకి విడుదల చేసింది. వొల్ఫ్ +, నాను + అనే రెండు వాహనాలను విపణిలోకి ప్రవేశపెట్టింది. యువతను లక్ష్యంగా చేసుకొని ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వోల్ప్…
ప్రపంచంలో ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీల్లో ఒకటి రోల్స్ రాయిస్ ఒకటి. ఈ కార్లను స్టేటస్ కు చిహ్నంగా వాడతారు. ఖరీదైన ఆ లగ్జరీ కారు కోటి రూపాయల నుంచి ఉంటుంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రోల్స్ రాయిస్ కంపెనీ తన చిహ్నం స్పిరిట్ ఆఫ్ ఎక్ట్స్‌టీ ఐకానిక్ చిహ్నాన్ని మార్చేందుకు సిద్దమైంది. దాదాపు 111 సంవత్సరాల తరువాత రోల్స్ రాయిస్ చిహ్నాన్ని రీ డిజైన్ చేస్తున్నది. రీ డిజైన్ చేసిన మస్కట్‌ను…
దేశంలో పెట్రల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మైలేజీ వస్తుంది. అయితే, ఏపీకి చెందిన ఎస్ఆర్ఎం విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. బైక్‌కు లిథియం…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేశారు. చేస్తూనే ఉన్నాయి. టూవీలర్స్‌తో పాటు, కార్లను కూడా ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. వాహనాల వినియోగం పెరగడంతో వీటికి డిమాండ్ కూడా పెరిగింది. దేశంలో మరో ఏఎంఓ ఎలక్ట్రిక్ స్కూటర్ జన్నీ ప్లస్ వాహనాన్ని లాంచ్ చేసింది. 60 వీ 40 ఎహెచ్ బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. క్రూయిజ్…
దేశీయ కార్ల దిగ్గజం టాటా అమ్మకాల్లో దూసుకుపోతున్నది. డీజిల్, పెట్రోల్ కార్లతో పాటుగా ఎలక్ట్రిక్ కార్లను కూడా టాటా కంపెనీ ఉత్పత్తి చేస్తున్నది. ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా టాటా కంపెనీ మొదట నెక్సాన్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసింది. 30.2 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఈ కార్లు నడుస్తున్నాయి. బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తు 312 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. డీసీ ఫాస్ట్ రీఛార్జ్ తో ఛార్జింగ్ చేస్తే గంటలో 80 శాతం…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇప్పటికే మోపెడ్, స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా క్రూయిజ్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్లు, హై స్పీడ్ స్కూటర్లు, ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. కాగా, కొమాకీ కంపెనీ ఇప్పుడు తొలి క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.…
దేశీయంగా టాటా మోటార్స్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో దూకుడు పెంచింది. టాటా నెక్సన్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన టాటా ఇప్పుడు మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుకు వచ్చింది. టాటా నెక్సన్ బ్యాటరీ సామర్థ్యంపై ఇప్పటి వరకు అనుమానాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండటంతై మైలేజీ తక్కువగా వస్తున్నది. దీంతో రేంజ్ ను పెంచేందుకు బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచి కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. అంతర్జాతీయ…
ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌లలో భారత్ కూడా ఒకటి. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఎన్నో కార్ల కంపెనీలు ఇండియాలో ప్లాంట్‌లను ఏర్పాటు చేసి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కార్ల నుంచి, ప్రీమియం బ్రాండ్ కార్ల వరకు ఇండియాలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లను ఇండియాలో నెలకొల్పేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే, ఎలన్ మస్క్ కు చెందని టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఎప్పటి నుంచో…
దేశంలో చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్య కీలకం. బ్యాటరీని ఛార్జింగ్ చేయాలి అంటే కనీసం రెండు మూడు గంటల సమయం పడుతుంది. ఈ సమస్యను అధికమించేందుకు ఓలా కంపెనీ భారత్ పెట్రోలియం లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నది. దేశంలోని నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోలియం బంకుల్లో ఓలా కంపెనీ…