భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీకి అండగా నిలుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
గెలుపు అంటే ఎంపీలు, ఎమ్మేల్యేలు గెలవడమే కాదని, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. మరొకరు గుజరాత్ నుంచి గెలిచారని, గుజరాత్ లో పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్నారు ఈటల రాజేందర్. 46 ఏళ్ల తర్వాత తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచామని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్,…
Etela Rajender: హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి అని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలన్నారు. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి…
BJP MP Etela Rajender Speech at Secunderabad Ujjani Mahakali Temple: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కన్నుల పండుగగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కుటుంబసమేతంగా ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన ఈటెల మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలుఅందజేశారు. బీజేపీ…
రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్ళు అని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, నేతలు… ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని రేవంత్ గతంలో చెప్పిన మాటల వీడియోను చూపిన ఈటల రాజేందర్.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలన్నారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. మాట తప్పిన వాళ్ళను…
తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఈటల ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని పేర్కొన్నారు.
ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కన్నెర్ర చేసి కేసీఆర్ ఓడిపోతేనే తమకు ఉద్యోగాలు వస్తాయని.. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీ పై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అవడం మంచి పరిణామమేనని, విభజన సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నారు ఈటల రాజేందర్. ఉద్యోగుల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదని, రెండు రాష్ట్రాల కు అవసరం అయ్యే విదంగా చర్చలు జరిగాలన్నారు ఈటల. మేము ఉద్యమ సమయంలో కూడా ఇదే విషయం చెప్పామన్నారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటుచేసుకున్న…