Etela Rajender : రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి
- రైతు రుణమాఫీకి నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్ళు అన్న ఈటల రాజేందర్
- ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు
- విశ్వసనీయత లేని పార్టీలను ప్రజలు బొంద పెడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్ళు అని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, నేతలు… ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని రేవంత్ గతంలో చెప్పిన మాటల వీడియోను చూపిన ఈటల రాజేందర్.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలన్నారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడతారని, విశ్వసనీయత లేని పార్టీలను ప్రజలు బొంద పెడతారని, తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారన్నారు ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదని, మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరని, ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదన్నారు ఈటల రాజేందర్.
పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదని, 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతోందన్నారు ఈటల రాజేందర్. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు ఎగనామం పెట్టినట్లే అని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులకు కూడా రుణమాఫీ చేయడం లేదన్నారు. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారని, రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ ఉండదని నిబంధనలు పెట్టారన్నారు ఈటల రాజేందర్. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్… నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారని, వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారన్నారు ఈటల రాజేందర్ అన్నారు.
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదని, రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవని, పిట్టల దొరలా రేవంత్ మాట్లాడారు.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు ఈటల రాజేందర్. ప్రజలను దండుకోవడం తప్పా.. పరిపాలన చేయడం లేదని, కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానమన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో రేవంత్ రెడ్డి… కెసిఅర్ జుట్ల ఉన్నారని, అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారన్నారని ఆయన మండ్డిపడ్డారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఈటల ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!