ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. సేవలను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. పాస్‌బుక్ లైట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఖాతాదారులు తమ మొత్తం పీఎఫ్ ఖాతా వివరాలను లాగిన్ అవ్వకుండానే ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు. మీ పీఎఫ్ ఖాతా వివరాలను పోర్టల్ నుండి నేరుగా వీక్షించవచ్చు. ఇప్పటి వరకు, మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ లేదా లావాదేవీలను తనిఖీ చేయడానికి విడిగా పాస్‌బుక్ పోర్టల్‌లోకి లాగిన్…
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) పీఎఫ్ ఖాతాదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా రూల్స్ ను మార్చుతోంది. తాజాగా ఉద్యోగుల పెన్షన్ విషయంలో కీలక మార్పు చేసింది. ఇప్పుడు, ఆరు నెలల కన్నా తక్కువ కాలం పనిచేసిన తర్వాత ఉద్యోగం మానేసిన వారికి ఈపీఎస్ ప్రయోజనం లభిస్తుంది. ఈ వ్యక్తులు ఇకపై వారి పెన్షన్‌కు తమ కాంట్రిబ్యూషన్ ను కోల్పోవాల్సిన అవసరం లేదు. EPS నిబంధనల ప్రకారం, పదవీ విరమణ నిధి సేకరణ సంస్థ గతంలో ‘జీరో కంప్లీట్…
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్‌లో నామినీ వివరాలు అప్‌డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు…
పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలను సరళీకరిస్తూ.. కొత్త రూల్స్ ను ప్రవేశ పెడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించుకునే నియమాలలో పెద్ద మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి ఖాతాలోని మొత్తాన్ని లేదా దానిలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పదవీ విరమణ నిధి సంస్థ ఒక ప్రతిపాదనను సమర్పించిందని ఒక…
పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది EPFO సభ్యులకు ప్రయోజనం చేకూరనున్నది. యూపీఐ, ఏటీఎం ద్వారా PF డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫార్సును ఆమోదించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని…
సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. వెంటనే ఆ పనిచేయాలని కోరింది. లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్…
పీఎఫ్ ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్ డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోది. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సిస్టమ్ ను మూడు నెలల్లో తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులను యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ…
సంగటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు గొప్ప వరం లాంటిది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. దీని ద్వారా ఉద్యోగి రిటైర్ మెంట్ అయిన తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అంతే కాదు తన చందాదారులకు ఈపీఎఫ్ఓ సూపర్ బెనిఫిట్స్ ను అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు భారీ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోంది. రూల్స్ ను సరళతరం చేస్తూ కొత్త రూల్స్ ను కూడా ప్రవేశపెడుతోంది. స్కీమ్స్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. ఈపీఎఫ్ఓ అందించే ఇన్సూరెన్స్ స్కీమ్…
PF And Aadhaar Link: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. దీని కోసం, వారు ఇప్పుడు తమ UAN, బ్యాంక్ ఖాతాను డిసెంబర్ 15 లోపు ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30 గా ఉండేది. కానీ, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సమయంలోపల పూర్తి చేయలేక పోయారు. దాంతో EPFO…
EPFO claim Limit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంబంధిత ఉద్యోగుల ఖాతా హోల్డర్లకు ఒక శుభవార్త. ఈపిఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం పరిమితిని రూ.50,000 నుండి రూ. 1 లక్షకు పెంచింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునేవారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వర్తించనుంది. దీనితో 27.74 కోట్ల మంది ఉద్యోగులు దీని ప్రయోజనం పొందనున్నారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను సులభతరం చేయడానికి ఆటో…