AP Govt School: రెండు తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇంగ్లిష్ మాట్లాడటం కాదు కదా కనీసం చూసి (పర్ఫెక్టుగా) చదవటం కూడా రాదనే చులకన భావం చాలా మందిలో ఉంది. అసలు తెలుగు అక్షరాలనే సరిగా గుర్తించలేకపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా అన్నవరానికి సమీపంలో ఉన్న బెండపూడి ప్రభుత్వ బడి పిల్లలు ఆంగ్లాన్ని అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇండియన్ ఇంగ్లిష్ కాదు. ఏకంగా అమెరికా ఇంగ్లిష్‌నే ఈజీగా దంచికొడుతున్నారు.