ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీతో పాటు సమాంతరంగా విచారణ చేస్తున్న ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.మనీలాండరింగ్ పాల్పడిన నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. ప్రభుత్వం నుండి కొల్లగొట్టిన రూ.370 కోట్లను విదేశీ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈకేసులో సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ కన్విల్కర్, సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్ లను అరెస్ట్ చేశారు. విశాఖ స్పెషల్ కోర్టులో వీరిని ఈడీ హజరుపర్చింది. ఆ నలుగురినీ విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. నలుగురికి జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
Also Read: EX MP Vivek: అవినీతి ఎక్కడుంటే.. సీబీఐ, ఈడీ అక్కడే ఉంటాయి
అరెస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ శేఖర్‌బోస్, డిజిటెక్ ఎంపీ వికాస్ నాయక్, పీపీఎస్‌పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్ సీఈవో ముకుల్ చంద్ర అగర్వాల్, ఎస్‌ఎస్‌ఆర్ అసోసియేట్స్ సురేష్ గోయల్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో హాజరుపరచగా, వారిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్‌పై కోట్లాది కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ గురువారం విచారణ జరిపింది. కాగా, అప్పటి సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ తన వాటా 10 శాతంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి మరింత డబ్బు పొందడానికి సాఫ్ట్‌వేర్ ఖర్చును పెంచడానికి ప్రాజెక్ట్ నివేదికను తారుమారు చేసిందని అధికారులు ఆరోపించారు.