ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.