నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.