Elon Musk: ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం కారణంగా బిట్ కాయిన్ పాతాళానికి చేరుకోనుంది. ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ X తీసుకున్న నిర్ణయంతో బిట్‌కాయిన్ ధర క్రాష్ అయింది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ ధర 28000డాలర్ల నుండి 25000డాలర్లకు తగ్గింది.
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను సంచలనాలకు మారుపేరుగా చెప్పొచ్చు. ఆయన ఏం చేసినా సంచలనమే. ట్విటర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి అయితే ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కు రెడీ అంటూ ఛాలెంజ్ చేయడం సంచలనం సృష్టించింది. మొదట్లో ఈ కేజ్ ఫైట్ కేవలం పుకారే అనుకున్న ఇది నిజంగానే జరగనున్నట్లు వీరు స్ఫష్టం చేశారు. ఈ…
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
Twitter Logo: ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ట్విట్టర్ లోగోగా ఉన్న పిట్టను తొలగించి.. Xను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వెబ్‌సైట్‌ను కూడా X.com మార్చారు.
Twitter: ట్విట్టర్ నేటి నుండి క్రియేటర్ల కోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా తెలియజేసింది. క్రియేటర్‌గా సంపాదించడానికి ఇంటర్నెట్లో X (X.com) అత్యుత్తమ ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.
ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు.
జూలై 22 నుంచి ట్విట్టర్ యూజర్లు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యపై వెరిఫై చేయని అకౌంట్ల కోసం షరతులు పెట్టింది. అయితే, కంపెనీ ఇంకా నిర్దిష్ట పరిమితులను వెల్లడించలేదు. మరిన్ని మెసేజ్‌లను పంపడానికి యూజర్లు పేమెంట్ సర్వీసు అయిన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. ఇటీవల, రిసీవర్ ఫాలో చేయని వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు ప్రత్యేక మెసేజ్ రిక్వెస్ట్ ఇన్ బాక్స్ కి మూవ్ చేసే ఒక ఫీచర్‌ను ట్విట్టర్ రూపొందించింది.