Donald Trump: ఎక్స్(ట్విటర్) లోకి ట్రంప్ రీ ఎంట్రీ.. ఏం పోస్ట్ పెట్టారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump X(Twitter) Re Entry: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు. 2021లో అమెరికా అధ్యక్ష కార్యాలయం వద్ద జరిగిన అల్లర్లలో ట్రంప్ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విటర్ ఖాతాను అప్పట్లో నిలిపివేశారు. దీంతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ట్రూత్. దాని ద్వారానే ట్రంప్ తాను చెప్పాలనుకున్న మెసేజ్ ను కన్వే చేసేవారు. ఆ తరువాత పరిస్థితులు మారడంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేశారు. అప్పుడే ట్రంప్ ఖాతాను పునరుద్దరిస్తామంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ట్రంప్ మాత్రం మళ్లీ ట్విటర్ ను ఉపయోగించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్స్(ట్విటర్)పై ట్రంప్ కోపం అప్పటికీ తగ్గలేదు కాబోలు.
Also Read: Narendra Modi: నరేంద్ర మోడీ రాజకీయ వారసుడు అతనే?
Also Read
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ఇదిలా వుండగా 2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు డోనాల్డ్ ట్రంప్. దాని ప్రచారం కోసమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ అకౌంట్ నిషేధించిన తరువాత ఈరోజు తొలిసారిగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)లోకి అడుగుపెట్టారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే జార్జియా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. 2021 జనవరి తరువాత తాను చేసిన తొలి ట్వీట్ లో ట్రంప్ తన మగ్ షాట్ షేర్ చేశారు. మగ్ షాట్ అంటే తమ రికార్డుల కోసం పోలీసులు తీసుకునే ఫోటో. దీనిని పోస్ట్ చేస్తూ ‘మగ్ షాట్ ఆగస్ట్ 24, 2023’ పేరుతో ట్రంప్ కామెంట్ కూడా పెట్టారు. ‘ఎన్నికల జోక్యం.. లొంగేది లేదు’ అనే క్యాప్షన్ జోడించారు. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్ డాట్ కామ్ పేరుతో తన వెబ్ సైట్ చిరునామాను కూడా అక్కడ ఉంచారు ట్రంప్. ఇక దీనిపై ట్వీటర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. నెక్ట్స్ లెవల్ అంటూ రిప్లై ఇచ్చారు. 2021 జనవరి తరువాత ట్రంప్ చేసిన తొలి ట్వీట్ ఇది. కాగా ఈరోజు ఉదయం ట్రంప్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Next-level https://t.co/E81JKWTJPS
— Elon Musk (@elonmusk) August 25, 2023
తాజావార్తలు
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!