అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన…
చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం కలిగిస్తున్నాయి. రేణిగుంటలో ఏనుగుల బీభత్సంతో జనం హడలిపోతున్నారు. మొలగముడి గ్రామంలో 3 ఏనుగులు సంచారంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పంట పొలాలపై వీరంగం సృష్టిస్తున్నాయి. చెరకు పంట నాశనం చేశాయి గుంపులుగా వచ్చిన ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. రాత్రి సమయాల్లో రైతులు పంటలకు కాపలా వుంటుంటారు. అయితే ఏనుగులు ఏ వైపు నుంచి వచ్చి తమపై దాడిచేస్తాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అన్నదాతలు, రైతులు ఆరుగాలం…
విజయనగరం జిల్లాలో గజరాజుల కలకలంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఏపుగా పెరిగిన పంటల్ని గజరాజులు తినేయడం, ధ్వంసం చేయడంతో విజయనగరం జిల్లాలో రైతులు ఆవేదన చెందుతున్నారు. నాలుగేళ్ళుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అధికారులపై మండిపడుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించట్లేదని రైతులు ఆందోళనకు దిగారు. రహదారిని దిగ్బధించారు. కొమరాడ మండలం అర్థం గ్రామంలో గ్రామస్తులు,రైతులు నిరసనకు దిగారు. రైతుల్ని అక్కడినించి పంపించేందుకు ప్రయత్నించారు అధికారులు. కానీ రైతులు మాత్రం తమ పట్టువీడలేదు.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి స్థానికంగా కలకలం రేపింది. అటవీశాఖలో ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా చిన్నబ్బ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపును తమిళనాడు అటవీప్రాంతానికి చిన్నబ్బ మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏనుగులు తిరగబడ్డాయి. వాటికి ఏమైందో తెలియదు కానీ… చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ మరణించాడు. కాగా మృతుడు చిన్నబ్బ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం…
ఆఫ్రికాలో కనిపించే పెద్ద జంతువుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఆఫ్రికా ఏనుగులను మచ్చిక చేసుకోవడం అంత సులభం కాదు. భారీ ఆకారంతో పెద్ద పెద్ద కోరలతో భయంకరంగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్లో ఈ ఏనుగులు వ్యాపించి ఉన్నాయి. మోజాంబిక్ దేశంలోని గోరంగొసా జాతీయ పార్క్ లో పెద్దసంఖ్యలో ఏనుగులను సంరక్షిస్తున్నారు. ఒకప్పుడు ఈ పార్క్‌లో పెద్ద పెద్ద దంతాలతో ఏనుగులు కనిపించేవి. అయితే, ఇప్పడుకనిపిస్తున్న ఏనుగులకు దంతాలు ఉండటం లేదు. దీనికి పెద్ద కారణమే…
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పంట పొలాలపై ఏనుగులు గుంపులుగా వచ్చి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి ఏనుగుల దాటి చేయడంతో భారీగా పంటనష్టం జరుగుతోంది. తోటకనుమ గ్రామపంచాయితీ దండికుప్పం పంట పొలాలపై ఏనుగుల గుంపులుగా విరుచుకుపడుతున్నాయి. పూతదశలో పంటను తినేసిసిన 20 ఏనుగుల గుంపు.. పది ఎకరాలకుపైగా వరి పంటను నాశనం చేశాయి. సుమారు అయిదు లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోని, ఆదుకోవాలని…