ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు,…
అన్నమయ్య జిల్లాలో విషాదయం చోటు చేసుకుంది.. ఓబులవారిపల్లి మండలం వై కోట గుండాల కోన సిద్దేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు.. అయితే, క్షేత్రానికి వెళ్తున్న భక్తులపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసింది.. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
Elephants Attack: జార్ఖండ్ రాష్ట్రంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. లతేహార్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తొక్కి చంపేశాయి. చనిపోయిన బాధితుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని నింపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో మల్హాన్ పంచాయతీ వద్ద ఇటుక బట్టీ యూనిట్ సమీపంలోని తాత్కాలిక గుడిసెలో 30 ఏళ్ల కూలీ ఫను భుయిన్యాన్ తన 26 ఏళ్ల భార్య బబితా దేవి, మూడేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన…