Bhatti Vikramarka : దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. మిగిలిన మూడు…
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఇంధన శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఏడాది పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. గత ఆరు సంవత్సరాల్లో పీక్ డిమాండ్ 2022 – 23లో 15370 మెగావాట్లు వచ్చింది. దీనికే…
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో ప్రారంభించింది. ఉదయం ఏపీ జెన్‌కో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగానే తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు.