Bhatti Vikramarka: అగ్రికల్చర్ పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము..
- రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- అగ్రికల్చర్ పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము
- ఏడాది పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఏడాది పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. గత ఆరు సంవత్సరాల్లో పీక్ డిమాండ్ 2022 – 23లో 15370 మెగావాట్లు వచ్చింది. దీనికే గత ప్రభుత్వం ఆహా, ఓహో అని గొప్పలు చెప్పుకుందని ఎద్దేవ చేశారు.
2023-24 మార్చి 8న 15623 మెగావాట్ల డిమాండ్ వచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత డిమాండ్ 2025 ఫిబ్రవరి 10న 15998 మెగావాట్లు వచ్చింది. ఇంత డిమాండ్ వచ్చినా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని వెల్లడించారు. విద్యుత్ అధికారులు ఎక్కడా హడావుడి చేయకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ సంపూర్ణంగా అందించగలిగాం.. ట్రాన్స్ కో, డిస్కామ్స్ బాగా పని చేశాయని తెలిపారు.
Also Read
Also Read:Uttam Kumar Reddy: కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం..
రాష్ట్రంలో 21339 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. సరాసరి ప్రతీ ఏటా 8 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. 2030 వరకు విద్యుత్ డిమాండ్ 24215 మెగావాట్ల డిమాండ్ వచ్చినా ఇబ్బంది లేదు. 2035లో 31809 మెగావాట్ల విద్యుత్ పీక్ డిమాండ్ వచ్చినా ఏర్పాట్లు చేసుకున్నాం అని తెలిపారు. పది సంవత్సరాల్లో నూతన విద్యుత్ పాలసీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించామని భట్టి విక్రమార్క తెలిపారు.
గ్రీన్ పవర్ ను ఎంకరేజ్ చేస్తున్నాము. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలు పెరుగుతున్నాయి. డేటా సెంటర్లు కూడా ఉన్నాయి. ఇంకా రాబోతున్నాయి. సింగరేణి నుంచి థర్మల్ పవర్ ను పెంచుకోవాలని భావిస్తున్నాము. నైని కోల్ బ్లాక్ దగ్గర ఒక థర్మల్ ప్లాంట్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాము. నైని బ్లాక్ కు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్నాం. కోల్ ట్రాన్స్ మినిట్ తక్కువ ధరకు ట్రాన్స్ మినిట్ చేయొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిపాము. ఈ అంశాన్ని క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Also Read:Manchu Manoj: “చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదు”.. మనోజ్ సంచలన వ్యాఖ్యలు
2022 నుంచి రెండేళ్లు యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులు ఆగిపోయాయి. Ngt సస్పెండ్ చేసింది. మేము అధికారంలోకి వచ్చే నాటికి పర్యావరణ అనుమతులు లేక పనులు ఆగిపోయాయు. రాజస్థాన్ ప్రభుత్వంతో మాట్లాడి సోలార్ పవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రభుత్వంతో 1600 మెగావాట్ల థర్మల్, 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ మొత్తం 3100 మెగావాట్లకు ప్రయత్నాలు చేస్తున్నాం. క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
జైపూర్ లోఉన్న సింగరేణి పవర్ ప్లాంట్ ను విస్తరిస్తాం.. రామగుండం థర్మల్ ప్లాంట్ ను కూల్చివేశాము. దీని స్థానంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. 2025 జనవరి 11న నూతన విద్యుత్ పాలసీని రూపొందించాము. 2030 నాటికి విండ్ పవర్ 2400 మెగావాట్ల, థర్మల్ 1000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్ల కోసం సబ్సిడీ రూ. 13269 కోట్లు విద్యుత్ శాఖకు ప్రభుత్వం చెల్లించిందని అన్నారు.
Also Read:Off The Record: అనుచరుల దందాలు ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఇరుకున పెడుతున్నాయా?
గృహ జ్యోతికి రూ. 1684.33 కోట్లు, ఉదయ్ పథకానికి రూ. 3246.36 కోట్లు, గణేష్ మండపాలకు రూ. 16.92 కోట్లు చెల్లించింది. రూ. 18615 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించింది. విద్యుత్ శాఖను నష్టపర్చడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు. ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నా… అందుకు ప్రభుత్వం సబ్సిడీని విద్యుత్ శాఖకు నెలనెలా చెల్లిస్తుందన్నారు. అగ్రికల్చర్ పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?