ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని, వినియోగానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 6 వేల కోట్ల భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.…
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ ప్రకటించిన తర్వాత… ప్రజలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.. ఇప్పటికే టీడీపీ, వామపక్షాలు, బీజేపీ విద్యుత్ ఛార్జీలపై పోరాటానికి దిగుతుండగా… ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇందులో చేరింది.. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్న ఆయన.. ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్…
విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఏడు దశల్లో ప్రజలపై…
ప్రజలపై క్రమంగా భారం మోపుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు… ఇలా అవకాశం ఉన్న ప్రతీది వడ్డించేస్తున్నారు.. ఇప్పటికే తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. కరెంట్ ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చింది ఈఆర్‌సీ.. వాటి ప్రకారం.. 30 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్‌కు…
తెలంగాణ వరుసగా అన్ని చార్జీలు పెరుగుతుండడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా విద్యుత్ చార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.. వైఎస్‌ఆర్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని ట్వీట్‌లో పేర్కొన్న ఆమె.. బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవంటూ మండిపడ్డారు.. మొన్న ఆర్టీసీ చార్జీలు…
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. నవంబర్ 31నే ప్రతిపాదనలకు చివరి రోజు కాగా.. డిసెంబర్ 27వ తేదీ వరకు అదనంగా గడువు ఇచ్చింది ఈఆర్సీ.. అయితే ఇప్పటికే ఏఆర్ఆర్లు సమర్పించిన డిస్కమ్స్.. మొత్తంగా 6831 కోట్ల చార్జీల పెంపునకు ప్రతిపాదనలు అందగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక, విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడిన టీఎస్ పీడీసీఎల్ సీఎండీ…
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై డిస్కమ్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయా? ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది?గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ ఏం చేస్తుంది? వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించే విషయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు కాలయాపన చేస్తున్నాయి. వాస్తవానికి నవంబర్ 31లోపు ఈఆర్సీకి డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే గడిచిన మూడేళ్ళ టారిఫ్ ప్రతిపాదనలు సైతం సమర్పించకుండా కారణాలు చెబుతూవచ్చాయి. విద్యుత్ నియంత్రణ మండలి కూడా కరోనా, లాక్…
తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి.…