Election Heat in YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది.. టార్గెట్ 2024గా వివిధ క్యాంపైన్ల కోసం కసరత్తు షురూ చేసింది వైసీపీ.. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మన భవిష్యత్తు క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు.. క్యాంపైన్ ట్యాగ్ లైన్.. నువ్వే మా నమ్మకం జగన్ అని ఖరారు చేశారు. జగనన్నే మన భవిష్యత్తు అనే ప్రధాన క్యాంపైన్ కింద వచ్చే ఎన్నికల వరకు వివిధ క్యాంపైన్లు నిర్వహించబోతున్నారు.. ఈ క్యాంపైన్ లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లనున్నాయి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు.. గత ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించబోతున్నారు నేతలు.. వారు అంగీకరిస్తే సందర్శించిన ఇంటికి, మొబైల్ ఫోన్ కు క్యాంపైన్ స్టిక్కర్ వేయబోతున్నారు.
ఇక, గృహ సారధుల సంఖ్య పెంచేందుకు సిద్ధం అయ్యారు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులకు అదనంగా మరో గృహ సారథిని నియమించనున్నారు.. దీంతో.. దాదాపు 7 లక్షల వరకు చేరబోతోంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల సంఖ్య.. మరోవైపు క్యాంపైన్ పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోమో విడుదల చేసింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన తిరుగులేని మెజార్టీని సాధించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలోని 175 స్థానాల్లో విజయం లక్ష్యంగా పనిచేస్తున్నారు.. వై నాట్ 175 అంటున్నారు సీఎం వైఎస్ జగన్.. వరుసగా వివిధ నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో సమావేశమై.. దిశాదిర్దేశం చేశారు.. ఇక, తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షనతో సమావేశం ప్రారంభమైంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ ఇన్ఛార్జులు, ఇతర నేతలు హాజరయ్యారు.. గడప గడపకూ మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహిస్తున్నారు.. ఈనెల 7వ తేదీన ప్రారంభంకానున్న జగనన్నే మా భవిష్యత్తు ప్రోగ్రామ్ పై కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే, ఈ మధ్య జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మూడు పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ ఓటమిపాలైంది.. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనూహంగా టీడీపీ ఓ సీటును సాధించింది.. దీంతో.. ఇవాళ జరుగుతోన్న సమయంలో.. ఎమ్మెల్యే పనితీరుపై సీఎం జగన్ ఘాటుగా స్పందించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. కేబినెట్‌లో మార్పులు చేర్పులు అంటూ ప్రచారం సాగుతోన్న సమయంలో.. అసలు కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.