Adinarayana Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై ఎప్పటి నుంచే చర్చ సాగుతూనే ఉంది.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయడం ఖాయమనే సంకేతాలు వచ్చినా.. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ముందుకు సాగుతాయా? అనే అంశంపై ఉత్కంఠ సాగుతూ వచ్చింది.. అయితే, ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై ఉత్కంఠ నెలకొన్ని వేళ.. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు ఆదినారాయణరెడ్డి. ఈ మూడు పార్టీలు కలుస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలను ఇచ్చిందన్న ఆయన.. కేంద్రం సంకేతాలు లేకుంటే తాను ఎందుకు మాట్లాడతాము అని ఎదురుప్రశ్నించారు. పొత్తుల విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
Read Also: Suchitra Krishnamoorthi: ఈ రాత్రికి నాతో పడుకో.. తెల్లారి ఇంటిదగ్గర దింపుతా అన్నాడు
వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలుస్తాయి.. ముందుగానే చెబుతున్నారు.. వైసీపీని ఓడించి తీరుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆదినారాయణరెడ్డి.. సీఎం వైఎస్ జగన్ ఓ కలుపు మొక్కగా పేర్కొన్న ఆయన.. జగన్‌ను బీజేపీ కలుపుకునే ప్రసక్తే లేదన్నారు.. మా పార్టీ.. ఈ ప్రభుత్వంపై సీరియస్ గానే ఉంది.. మడకశిరలో మా నాయకుడు, కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.. ఇక, జేపీ నడ్డా , అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు బీజేపీ అండలేదు.. దండ లేదని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా కేసులో మా పై ఆరోపణలు చేశారు.. సీబీఐ తేల్చేసింది.. వారి శీలం ఏమిటో తెలిపిందని చెప్పుకొచ్చారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.