భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మూడు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది.
YSRCP: విజయవాడలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతలు తిరుపతి మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, తిరుపతిలో ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజలను భయపెట్టి, ప్రలోభాలు చూపించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిర్వాకం వహిస్తున్నారని, టీడీపీ నాయకులు బహిరంగంగా దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులేమీ…
నేడు కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Congress: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు సభ్యులు ఉండే ఎలక్షన్ ప్యానెల్‌లో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా.. తాజాగా గోయెల్ కూడా రాజీనామా చేయడంతో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతంతా ఆయన మీదే ఉంది. అయితే, సీఈసీ రాజీవ్ కుమార్‌తో విభేదాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల కమిషనర్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడంతో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో ఒక స్థానం ఖాళీ కానుంది.
అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియామకం ఎందుకంత వేగంగా చేపట్టాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాలను వేగంగా ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అరుణ్ గోయల్ నియామక దస్త్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం హడావుడిగా ఆయనను ఈసీగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
గుజరాత్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. దేశంలోని అత్యున్నత పోల్ బాడీలో మూడో పోస్టు దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది.