సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. అయితే, ఈ కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేశారు మోహన్‌బాబు.. మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది..