Manchu Mohan Babu: మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు షాక్.. ఆ కేసులో స్టేకు నిరాకరణ
- మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో షాక్..
- 2019 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ..
- మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Mohan Babu: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. అయితే, ఈ కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేశారు మోహన్‌బాబు.. మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. ధర్నా జరిగినప్పుడు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నారు కదా..? అని మోహన్‌బాబు తరపు న్యాయవాదిని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు.. అయితే, తాను కాలేజీ నడుపుతున్న 75 సంవత్సరాల వ్యక్తి అని.. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తనా నియామవాళి వర్తించదని మోహన్ బాబు వాదించారు.. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం తాము చేసిన ధర్నా ఎంసీసీ పరిధిలోకి రాదని.. చార్జషీట్‌లోనూ ఎంసీసీ ఉల్లంఘన కేసు తమపై మోపారని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మోహన్ బాబు తరపు న్యాయవాది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: Misha Agarwal: ఫాలోవర్స్ తగ్గారని సూసైడ్ చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్
Also Read
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!