సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రాలను తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్నారు దర్శకులు, సంగీత దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన రూపొందించిన చిత్రాలు, వాటిలో స్వయంగా స్వరకల్పన చేసిన గీతాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. ఏది చేసినా, జనానికి వినోదం పంచాలన్నదే కృష్ణారెడ్డి లక్ష్యంగా సాగారు. మళయాళంలో అలరించిన సల్లాపం చిత్రం ఆధారంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎగిరే పావురమా చిత్రం వెలుగు చూసింది. శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పి.ఉషారాణి నిర్మాతగా…