Study in Germany: ఐఎంఎఫ్‌ఎస్.. విద్యార్థులకు ఎలాంటి సర్వీసులు అందిస్తోంది?. ఈ సంస్థ ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మరీ ముఖ్యంగా జర్మనీలో స్థిరపడాలనుకునేవారికి ఎలాంటి ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి?. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఎన్-కెరీర్’.. ఓవర్సీస్ స్టడీస్‌లో పేరుగాంచిన వ్యక్తి, ఐఎంఎఫ్‌ఎస్ సీఈఓ కేపీ సింగ్, డైరెక్టర్ అజయ్ కుమార్ వేములపాటి, anhalt రిప్రజెంటేటివ్ లిండాను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది.
Global Telugu Teacher: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కృష్ణప్రసాద్ గవర్నమెంట్ టీచర్. హెడ్‌మాస్టర్ కూడా. తెలుగు పైన ఆయనకు మమకారం ఎక్కువ. విద్యార్థుల్లో ఈ భాష మీద ఆసక్తి పెంచేందుకు కృష్ణప్రసాద్ చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. చదువంటే ఇంగ్లిష్ పాఠాలే అన్నట్లుగా మారిన ఈ రోజుల్లో పిల్లల్లోని, తల్లిదండ్రుల్లోని ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. పాఠాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
E-Pathshala For All: ‘ఇ-పాఠశాల’ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) ప్రవేశపెట్టింది. ఇది అందరి వేదిక. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టీచర్ ఎడ్యుకేటర్స్, పాలసీ ప్లానర్స్, సామాన్యులు, ప్లేయర్స్.. ఇలా ప్రతిఒక్కరికీ అవసరమైన డిజిటల్, డిజిటైజబుల్ వనరులు ఈ ప్లాట్‌ఫాంలో దొరుకుతాయి. ఇక్కడ నాణ్యమైన విద్య లభిస్తోంది.