Telangana Inter Supply Results : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర ఇంటర్‌బోర్డు (TSBIE) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు తుది తేదీని ప్రకటించింది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించిన ప్రకారం, ఈ నెల 16వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. Kajol : ఫోటోగ్రాఫర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు ఇంతకు ముందు మే 22 నుంచి 29వ తేదీ వరకు…
ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్‌బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వారి భవితవ్యం నేడు తేలనుంది.
Resonance : ఆల్ ఇండియా జేఈఈ మెయిన్ 2025లో హైదరాబాద్‌లోని ‘రెసోనెన్స్’ జూనియర్ కళాశాలల విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారు. మాదాపూర్ లో గల రెసోనెన్స్ స్కూల్ విజ్డమ్ క్యాంపస్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను రెసోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో అద్భుత విజయం సాధించడం రెసోనెన్స్ ప్రతిభ మరోసారి నిరూపితమైందన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, ఇతర మెడికల్ ప్రవేశ పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంకులు సాధించడంలో…
Inter Syllabus : 2025-26 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెద్ద మార్పులు ఎదురవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలుకు సిద్ధమవుతోంది. అధికారికంగా సిలబస్ ను ఫైనల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ మార్పులు కేవలం సిలబస్ పరిమితిలోనే కాకుండా, పరీక్షా విధానంలోనూ ప్రతిఫలించనున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా…
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో 78 మందితో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలు అందరూ రాశాడు. తాజాగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ 78 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థిని ఆనందల మల్లికకు 294 మార్కులు వచ్చాయి. మిగతా 77 మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిలయ్యారు. జూనియర్ కాలేజీ లో ప్రిన్సిపాల్, లెక్చలర్లు లేకపోవడంతో ఉత్తీర్ణశాతం పూర్తిగా దెబ్బతింది.
నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని,…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్…
తెలంగాణ మోడల్ పాఠశాలల్లో ఇంటర్ అడ్మిషన్స్ 2024 కోసం నోటిఫికేషన్ ప్రకటించబడింది. అడ్మిషన్ 2024 – 25 విద్యా సంవత్సరకు జరుగుతుంది. ఈ ప్రవేశం మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మే 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేయాలి. మే 31 చివరి రోజు అని ప్రకటించారు. దరఖాస్తు షరతులు పదవ తరగతి ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు వర్తిస్తాయి. ALSO READ: SBI Jobs: ఎస్‌బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు…
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..! తాజాగా విడుదలైన…
Summer Holidays: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్తను విద్యాశాఖ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులను నేటితో ఉంటాయని ప్రకటన జారీ చేసింది.