NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG 2026 Paper Leak Case: నీట్ (NEET-UG 2026) కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI)కి ఈరోజు మరో కీలక విజయం దక్కింది. పేపర్ సెట్టింగ్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ అరెస్ట్ అయిన మనీషా మంధారేను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టగా, నిందితుల చాకచక్యాన్ని గమనించిన న్యాయస్థానం సీబీఐకి పూర్తి స్థాయిలో 14 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ పేపర్ లీక్ ఎంత పకడ్బందీగా జరిగిందో కోర్టు రూమ్‌లో సీబీఐ వినిపించిన వాదనలు స్పష్టం చేశాయి. కోర్టులో సీబీఐ వెల్లడించిన నిజాల ప్రకారం.. మనీషా మంధారే సాదాసీదా నిందితురాలు కాదు.. ఆమె బాటనీ (వనస్పతి శాస్త్రం), జూలాలజీ (జంతు శాస్త్రం) ప్రశ్నపత్రాలను అనువదించడంలో నిపుణురాలు. ఈ కారణంగానే ఆమెకు నేరుగా ఒరిజినల్ ప్రశ్నపత్రాలను చూసే అవకాశం దక్కింది. దీనిని ఆసరాగా చేసుకునే ఆమె మొత్తం వ్యవస్థను మోసం చేసింది.
అంతేకాదు.. ఈ కుట్ర వెనుక ఒక త్రికోణ నెట్వర్క్ ఉంది. మనీషా మంధారే ఒంటరిగా కాకుండా పి.వి. కులకర్ణి, మనీషా వాఘ్మారేలతో కలిసి ఈ కుట్రకు పాల్పడింది. తన వద్ద ఉన్న ఒరిజినల్ ప్రశ్నపత్రాన్ని ఆమె శుభమ్ అనే మరో నిందితుడికి చేరవేయగా, అతను దానిని మరింత అందరికీ పంపిణీ చేశాడు. ఈ నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటంతో, ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు, విచారణలు జరుగుతున్నాయని, అందుకే మనీషాను విచారణ కోసం, ఆధారాల సేకరణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందంటూ సీబీఐ 14 రోజుల భారీ కస్టడీని కోరింది. పరీక్షలు నిర్వహించే సంస్థలను గుడ్డిగా నమ్మే కోట్ల మంది తల్లిదండ్రుల నమ్మకాన్ని ఈ ఉదంతం నట్టేట ముంచింది. పేపర్లు తయారు చేసేవారే, వాటిని అనువదించేవారే ఇలా కంచె చేను మేసినట్లు ప్రవర్తిస్తే, పిల్లల కష్టానికి దక్కే ‘ఫలితం’ ముందే అమ్ముడుపోయినట్లే కదా! ఈ 14 రోజుల రిమాండ్‌లో సీబీఐ ఈ మొత్తం ముఠాకు సంబంధించిన చివరి లింకును కూడా ఛేదిస్తుందని ఆశిద్దాం!!
Also Read
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!