తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా సమగ్ర మద్దతు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణలో స్థాపించేందుకు కేటాయించినట్లు ప్రకటించబడింది.
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీసీ కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, ఇతర అవసరాల విషయంలో…
MLC Kavitha : తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి రూ. 500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అంతర్జతీయ యూనివర్సిటీలతో పోటీ పడాలని విద్యార్థులకు సూచించారు. రాజీవ్ గాంధీ కన్న కళలను నేరేవేరుద్దామన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ కృషి చేశారని సీఎం తెలిపారు. రాజకీయాల్లో మహిళలు…
Minister Narayana : నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నారాయణ. కార్పొరేట్ స్కూల్స్ విజయానికి కారణం తల్లిదండ్రులు..…
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,872 కోట్లతో 8 ఏళ్ల కాలంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఇంజనీరింగ్ , లా కాలేజీలకు మంజూరైనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యాభివృద్ధి కోసం ఈ జిల్లాకు చాలా మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.