మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పాట్నా కార్యాలయంలో హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. భూములు తీసుకుని.. బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్దరు నేతలను విచారించనున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఇటీవల నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జవవరి 18న తమ ముందు హాజరుకావాలని కోరింది. అయితే మరోసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఇలాగే ఈడీ సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గోవాకి మూడు…
మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. మంత్రి సుజిత్ బోస్‌కు సంబంధించిన ఇళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Mahadev Betting App : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పేరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జ్ షీట్‌లో ప్రస్తావించబడింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈడీ సమన్లను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై అధికారులు సోదాలు జరిపి ఉదయం అరెస్ట్ చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ట్వీ్ట్స్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆప్ నేతలు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేజ్రీవాల్‌ని ప్రశ్నించేందుకు ఈడీ అనేక సార్లు…
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మూడోసారి కూడా సమన్లను దాటవేశాడు. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కేవలం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే లక్ష్యమని ఆప్ ఆరోపించింది.
ED Raids: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్‌లో ఉంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌ని జనవరి 3న తమ ముందు హాజరుకావాలని కోరింది.
Lalu Yadav: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ స్కామ్‌లో లాలూ కుటుంబం నిందితులుగా ఉంది. తేజస్వీ యాదవ్‌కి శుక్రవారం ఈడీ సమన్లు అందగా.. డిసెంబర్ 27న ఏజెన్సీ ముందు హాజరు కావాలని లాలూని ఈడీ కోరింది
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.