Kejriwal Arrest: జర్మనీ జోక్యంపై కేంద్రం ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని కేంద్ర విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పెను దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ జర్మనీ విదేశాంగ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శనివారం ఢిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ పిలిచి నిలదీసింది. వారి ఎదుట నిరసన వ్యక్తం చేసింది.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని… ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు అని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ప్రకటనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. దీంతో ఈ ఉదయం జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్‌వీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన ఎదుట భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ విధానం మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకుణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా.. ఏడు రోజులు ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. తనను అరెస్ట్ చేయకుండా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం దక్కలేదు. అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పడంతో కొన్ని నిమిషాల్లోనే అధికారులు కేజ్రీవాల్ నివాసాని చేరుకుని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?