MLC Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేస్తూ రోస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడి, సిబిఐ రెండు కేసుల్లోని కవిత బెయిల్ పిటిషన్‌పై మే 6న తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి కావేరీ బవేజా ప్రకటించారు. కాగా.. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇప్పటికే వాయిదా పడింది. ఏప్రిల్ 22న తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు. ఈరోజు (గురువారం) జైలు లేదా బెయిల్ అని భావించారు. అయితే కోర్టు తీర్పును మరోసారి వాయిదా వేయడంతో కవితకు నిరాశే మిగిలింది. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని, అరెస్టుపై విచారణ వరకు కవితపై ఎలాంటి ఆధారాలు లేవని కవిత తరఫు న్యాయవాదులు వాదించారు.
Read also: Rahul Gandhi : చివరి క్షణంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. అమేథి కాకుండా రాహుల్ పోటీ ఇక్కడినుంచే
బీఆర్‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, ఎన్నికల ప్రచారానికి బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు. పార్టీకి స్టార్ క్యాంపైనర్. ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్నపుడే, ఏం చెయ్యలేక పోయామన్నారు. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుందని తెలిపారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదన్నారు. అరెస్ట్‌కు సరైన కారణాలు లేవని కవిత తరపున వాదనలు వినిపించారు. అనంతరం సీబీఐ తరపున వాదనలు జరిగాయి. “కవితకు బెయిల్ ఇవ్వొద్దని, కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాల్టికి (మే 2కు) రిజర్వ్ చేసింది. అయితే నేడు కవితకు బెయిల్ రానుందా? ట్రయల్ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. పిటిషన్ ను మే6కి వాయిదా వేసింది కోర్టు.
Hyderabad: నగరంలో ఏరులై పారుతున్న మద్యం.. ఎంట్రీ ఇచ్చిన ఎస్ఓటీ బృందం