Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడగించింది. మరో 14 రోజుల పాటు అతను జైలులోనే ఉండాలి. కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ నేత కవిత కూడా జ్యూడీషియల్ కస్టడీని పొడగించింది. మే 07న తదుపరి విచారణ జరగనుంది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఏప్రిల్ 15న కోర్టు ఈ కేసును విచారించింది. అయితే ఈడీ నుంచి సమాధానం వచ్చే వరకు కేజ్రీవాల్‌కి తక్షణ ఉపశమనాన్ని నిరాకరించింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే అభ్యర్థనను తిరస్కరించింది. ఈడీ తన వాదనలకు మద్దతుగా కావాల్సిన సమాచారాన్ని దాఖలు చేసిందని పేర్కొంది.
Read Also: MLC Kavitha: కవితకు మరో బిగ్ షాక్.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ మద్యం కేసులో రూ. 100 కోట్ల ముడుపుతు తీసుకున్నట్లు కేజ్రీవాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటిని గోవా ఎన్నికల ప్రచారంలో వాడినట్లు ఈడీ బలంగా వాదనలు వినిపిస్తోంది. అయితే, ఆప్ మాత్రం ఈ వాదనల్ని ఖండిస్తోంది. బీజేపీ తమ నాయకుడిని జైలో హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపిస్తోంది. కేజ్రీవాల్‌ని రాజకీయ ప్రతీకారంలోనే అరెస్ట్ చేసినట్లు ఆరోపిస్తోంది. కాగా, కేంద్రం ఆప్ వాదనల్ని తోసిపుచ్చింది. మరోవైపు కేజ్రీవాల్‌కి ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆప్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటూ షుగర్ లెవల్స్ పెంచుకుని, అనారోగ్య కారణాలతో బెయిల్ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల ఈడీ ఆరోపించింది.