ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్‌కు షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. డయాబెటిక్‌తో బాధపడుతున్న ఆయనకు కస్టడీలో షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్‌ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపించాయి.
ఇటీవల కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా ఆరోపించారు. ఒక దశలో షుగర్ లెవల్ 46 ఎంజీ స్థాయికి పడిపోయినట్లు సమాచారం. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం అని కోరాయి.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ కస్టడీ గురువారంతో ముగియనుంది. మార్చి 28న ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆ సమయంలో కేసు గురించి నిజాలన్నీ సీఎం బయటపెడతారని ఇప్పటికే సునీత తెలిపారు. మద్యం కేసులో డబ్బుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ సీఎం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది.
ఇది కూడా చదవండి: Pakistan Head Coach: పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా ఆ దిగ్గజ ఆటగాడు..!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈనెల 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అంతకముందు అరెస్ట్ చేయకుండా అనుమతులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకుని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: The Goat Life: ఇతని జీవితం మీదనే సినిమా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్