Banana Exports: అమెరికాతో సైనిక ఒప్పందంపై ఈక్వెడార్‌తో ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి అరటిపండ్లను దిగుమతి చేసుకోవాలని రష్యా భావించింది. దీంతో భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభయ్యాయి. భారత్ నుంచి మొదటి బ్యాచ్ అరటిపండ్లు జనవరిలో రష్యాకు ఎగుమతి అయ్యాయి. తదుపరి బ్యాచ్ ఫిబ్రవరి చివరిలో ఎగుమతి అవ్వనుందని రష్యన్ వాచ్‌డాగ్ రోసెల్‌ఖోజ్నాడ్జోర్‌ని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. రష్యన్ మార్కెట్‌కి భారత్ అరటిపండ్ల ఎగుమతులు పెరుగుతున్నట్లు పేర్కొంది.
Amazon Rainforest: ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవి, ప్రపంచానికి ఊపిరితిత్తుల్లా పనిచేస్తున్న చెట్లతో నిండి ఉన్న అమెజాన్ వర్షారణ్య అటవీ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమికి అవసమయ్యే ఆక్సిజన్ ఎక్కువగా ఈ అడవుల్లో నుంచే వస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతపెద్దగా ఉంటుంది ఈ అమెజాన్ ఫారెస్ట్. తాజాగా అమెజాన్ అడవిలో అత్యంత పురాతనమైన నగరాన్ని పరిశోధకులు కనుగొనడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.
Ecuador Gunmen: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్‌లో మంగళవారం ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా టీవీ స్టూడియోపై దాడి జరిగింది. దాడి చేసిన 13 మందిపై తీవ్రవాద అభియోగాలు నమోదు చేయనున్నారు.
ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు గురైన నేపథ్యంలో గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదే సమయంలో హత్యపై దర్యాప్తులో సహాయం చేయాలని ఎఫ్‌బిఐని కోరారు. 59 ఏళ్ల జర్నలిస్ట్, అవినీతి వ్యతిరేక క్రూసేడర్ ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు సంబంధించి ఆరుగురు కొలంబియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దక్షిణ ఈక్వెడార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈక్వెడార్‌లోని అలౌసీలో గల ఒక పర్వత గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో మట్టి, శిథిలాల కింద చిక్కుకుని 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
పెరూ, ఈక్వెడార్‌లను భారీ భూకంపం శనివారం వణికించింది. ఈ శక్తివంతమైన భూకంపంలో దాదాపు 12 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని ఈక్వెడార్ ప్రెసిడెన్సీ తెలిపింది.
15 killed in Ecuador prison violence: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య తీవ్రఘర్షణ చెలరేగింది. ఈక్వెడార్ లోని లటాకుంగాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణల కారణంగా 15 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల కారణంగా మరో 21 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల రవాణా మార్గాలపై ముఠాల మధ్య ఘర్షణకు కారణమయ్యాయని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో అన్నారు. ప్రస్తుతం అధికారులు మృతదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర…
ఈక్వెడార్ జైలులో నరమేధం కలకలం రేపింది.జైలులో గత 24 గంటల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో 52మంది ఖైదీలు మరణించారు. 10మందికి పైగా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ కాలిన మృతదేహాలు కనిపించాయి. జైలులో గంటల తరబడి తుపాకీ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జైలులో ఖైదీల నుంచి తుపాకులు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేరాలను అణచివేసేందుకోసం గత…