Caste Census : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే నివేదికను ఈ రోజు మధ్యాహ్నం ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీ కి అందజేశారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ నివేదికను సమర్పించింది. ఈ సమావేశం సచివాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన సర్వే దాదాపు 50…
ఈ ఏడాది బులియన్ మార్కెట్ ధరలు మిశ్రమంగా ఉంటాయని.. ఆర్థిక సర్వే అంచనా వేసింది.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత.. సభలో ఆర్థిక సర్వేలను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ఈ ఏడాది బులియన్ మార్కెట్ దరలు మిశ్రమంగా ఉంటాయని అంచనా వేసింది.. ఈ సమయంలో పడిసి ధరలు తగ్గుతాయని పేర్కొంది.. ఇక, బంగారం ధరలు తగ్గినా.. వెండి ధర…
Working hours: ఇటీవల పలు సంస్థల సీఈఓలు, కీలక అధికారులు ఉద్యోగులు పని గంటలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఉద్యోగి వారానికి 70-90 గంటలు పనిచేయలనే వాదన నేపథ్యంలో బడ్జెట్ ముందు కేంద్రం తీసుకువచ్చిన ‘‘ఆర్థిక సర్వే’’ కీలక విషయాలను చెప్పింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు…
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. పార్లమెంట్‌లో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టింది. అలాగే మరోవైపు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో శుక్రవారం ఉదయం నుంచి సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% - 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది.
ఈ సంవత్సరం ప్రవేశ పెట్టనున్న యూనియన్ బడ్జెట్ కోసం ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్నారు.
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది.
Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి యూపీలోని బరేలీ జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. జనవరి 7వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాలని పేర్కొనింది.