Gold and Silver Prices: గుడ్‌న్యూస్.. తగ్గనున్న బంగారం ధరలు..!
- పసిడి ప్రేమికులకు శుభవార్త..
- ఈ ఏడాది మిశ్రమంగా బులియన్ మార్కెట్ ధరలు..
- ఆర్థిక సర్వే అంచనా..
- పడిసి ధరలు తగ్గుతాయని అంచనా వేసిన ఆర్థిక సర్వే..
- వెండి ధర మాత్రం మరింత కొండెక్కుతుందని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices: గోల్డ్ రేటు పరుగులు పెడుతోంది! ఈ యేడాది ఒక్క నెలలోనే రూ. 5వేలు జంప్ కొట్టింది. జనవరి 1న తులం బంగారం 79వేల చిల్లర ఉంటే.. నెల చివరలో 5 వేల 500 పెరిగింది. కిలో వెండి ధర సైతం రూ.95 వేలు దాటింది. త్వరలోనే సిల్వర్ లక్ష మార్కుకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.84,900కి చేరింది. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని బులియన్ మార్కెట్ వర్గాలంటున్నాయి. అయితే, పసిడి ప్రేమికులకు శుభవార్త చెప్పింది కేంద్రం..
Read Also: Kiara Advani: మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లతో రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..
Also Read
ఈ ఏడాది బులియన్ మార్కెట్ ధరలు మిశ్రమంగా ఉంటాయని.. ఆర్థిక సర్వే అంచనా వేసింది.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత.. సభలో ఆర్థిక సర్వేలను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ఈ ఏడాది బులియన్ మార్కెట్ దరలు మిశ్రమంగా ఉంటాయని అంచనా వేసింది.. ఈ సమయంలో పడిసి ధరలు తగ్గుతాయని పేర్కొంది.. ఇక, బంగారం ధరలు తగ్గినా.. వెండి ధర మాత్రం మరింత కొండెక్కుతుందని స్పష్టం చేసింది.. ఖనిజాల ధరలు కూడా ఈ ఏడాది దిగివస్తాయని అంచనా వేసింది.. మరోవైపు రష్యా చమురు ఎగుమతులపై ఎన్ని ఆంక్షలు విధించినా ఈ సంవత్సరం ముడి చమురు ధరలు పతనం తప్పదని అంచనా వేసింది ఆర్థిక సర్వే.. ఆల్‌టైం హై రికార్డు సృష్టించిన పసిడి ధర ఏ మాత్రం కిందకు దిగివస్తుందో చూడాలి మరి..
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!