హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధి ఈసీఐఎల్ x రోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. కత్తితో దాడి చేస్తున్నా స్థానికులు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. వారం రోజుల్లో మేడ్చల్ పరిధిలో ఇది మూడో మర్డర్. అయితే.. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.