నెల్లూరు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు భయాంధోళనలకు గురయ్యి బయటకు పరుగులు తీశారు. దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఈ ఘటన జరిగింది. స్వల్పంగా మాత్రమే భూమి కంపించడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు భూమి కంపించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భూకంపాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. సముద్రతీర ప్రాంతం కావడంతో ఈ జిల్లాకు వానలు, వరదల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.