దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్మ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కనెక్టివిటీ విమానాలు అందుకోవల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ప్రయాణికులు నిలిచిపోయారు. సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ఢిల్లీ విమానాశ్రయం…
దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం దుమ్ము తుపానుతో పాటు మోస్తరు వర్షం కురిసింది. ఢిల్లీ నగరంలో నిన్న సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. దాంతో కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ దుమ్ము ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ పైనా పడింది. దుమ్ము దుమారం కారణంగా ఎంఐ ప్లేయర్స్ హుటాహుటిన మైదానంను వీడాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం…
దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది.
గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వేడితో అల్లాడిపోతుంది. ఇప్పటికే 52 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకోవైపు నీటి సమస్యతో బాధపడుతోంది. మరికొన్ని రోజులు హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ముంబైలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అంతేకాకుండా.. భారీ వర్షం కురిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో.. ముంబై వాసులు వేడి నుండి ఉపశమనం పొందారు. కాగా.. ఈ సీజన్‌లో ముంబైలో ఇది మొదటి వర్షపాతం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మెట్రోపాలిటన్ యొక్క స్కైలైన్ మురికి గాలులతో చుట్టుముట్టింది. దీంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీని తాజాగా దుమ్ము తుఫాను చుట్టిముట్టింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన రాజధాని నగరం ఇప్పుడు దుమ్ము తుఫానుతో భయాందోళనలు కలిగిస్తుంది.
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ధూళి తుపాను కారణంగా హార్డిన్ సమీపంలోని మోంటానాలోని ఇంటర్‌స్టేట్ 90 ప్రాంతంలో 21 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి.