ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున బద్రీనాథ్ బాబు తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘శ్రీ…
విజయవాడ: దుర్గగుడి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. సోమవారం దుర్గగుడి పాలకమండలి భేటీ అయింది. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
జయవాడ దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమైంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. దేవస్ధానంలో NMR లుగా పదుల సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్ చేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 50 మంది NMR లు దుర్గ గుడిలో పని చేస్తున్నారని.. 50 శాశ్వత ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు.
విజయవాడ దుర్గగుడి లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపుతున్నాయి. దుర్గగుడి లో పనిచేస్తున్న ఇద్దరు ఆలయ ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందారు. తాజాగా అధికారుల విచారణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం బయటపడింది. దుర్గగుడిలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందినట్లు గుర్తించి వారిని సస్పెండ్ చేసారీ ఆలయ ఈఓ. సస్పెండ్ చేసిన ఆ ఇద్దరు పైన కేసు నమోదు చేసే అవకాశం…