Mallu Bhatti Vikramarka: నేడు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో పాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యే విజయరమణ రావు పాల్గొననున్నారు. ఇక శుక్రవారం హైదరాబాద్ లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతుల వ్యవసాయ పంపుసెట్లను ఎంపిక చేసి సోలార్ పవర్ ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ప్రభుత్వ ఖర్చుతో పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయాలని అధికారులకు భట్టి ఆదేశాలు జారీ చేశారు.
Read also: KrishnaManineni : ‘100 డ్రీమ్స్ ఫౌండేషన్’ను అభినందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కార్యక్రమ వివరాలు..
* ధర్మారం మండలం కటికెనపల్లి,మేడారం గ్రామాల విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన..
* ధర్మారం మార్కెట్ యార్డులో ధర్మపురి నియోజకవర్గ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం బహిరంగసభ..
* మధ్యాహ్నం 2:15 కి జూలపల్లి మండలం, కాచాపూర్ గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన..
* మధ్యాహ్నం 2:30 గంటలకు పెద్దపల్లి మండలం, రంగాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
* మధ్యాహ్నం 2:45 నిమిషాలకు పెద్దపల్లి మండలం, రాఘవపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
* మధ్యాహ్నం 3:00 గంటలకు.. ఆర్డీవో కార్యాలయం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
* మధ్యాహ్నం 3:15 నిమిషాలకు.. పెద్దపల్లి పట్టణం జెండా చౌరస్తా వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Sathyam Sundaram : కార్తీ – అరవింద్ స్వామిల ‘సత్యం సుందరం’ టీజర్ వచ్చేసింది..