D. Srinivas : డీఎస్ పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ (76) శనివారం కన్నుమూత
- కాంగ్రెస్ కండువా కప్పి నివాళులు అర్పించిన భట్టి.. శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ (76) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్న శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు. ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నట్లు సమాచారం. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే.. డి.శ్రీనివాస్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
టీపీసీసీ తరుపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. డీఎస్ పార్థీవదేహంపైన కాంగ్రెస్ పార్టీ జెండా కప్పిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు నివాళులు అర్పించారు. కాసేపట్లో డీఎస్ పార్థివదేహానికి పోలీసుల గౌరవ వందనం నిర్వహించనున్నారు. ఆ తరువాత నిజామాబాద్ కు డీఎస్ పార్థివదేహం తరలించనున్నట్లు సమాచారం. అయితే. శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దిగి నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి.. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!