క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే…
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 23న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. కాగా.. టీమిండియా మొదటి మ్యాచ్‌లో గెలిచి ఎంతో ఉత్సాహంతో ఉంది. తర్వాత మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. టీమిండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.