శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు.. రూ. 7 కోట్లు విలువ చేసే కేజీ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ SOT, మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుంది అంతర్రాష్ట్ర ముఠా. రాజస్థాన్కు చెందిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు.
Cocaine: ఒడిశాలోని పారాదీప్ పోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. పోర్టులోని ఓ ఓడలో రూ.220 కోట్ల విలువైన కొకైన్‌ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి పారదీప్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ వద్ద లంగర్ వేసి ఉన్న ఓడలోని క్రేన్లో 22 అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయని వారు వెల్లడించారు.
2021 మరికొద్దిగంటల్లో కనుమరుగు కానుంది. అయితే యువత మాత్రం 2021ని సాగనంపుతూ.. 2022కి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కరోనా, ఒమిక్రాన్ ఏమున్నా జాన్తా నై అంటూ వేడుకలకు రెడీ అయిపోతున్నారు. ఆంక్షల బందీఖానా నుంచి వారు బయటపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలలో ఏటా డ్రగ్స్ విచ్చలవిడిగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి వస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి విక్రయాలు జరుగుతాయని పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా…
అసలే లేడీ కిలాడీలు. నేరాల్లో ఆరితేరిపోయారు. ఏ చిన్న అవకాశాన్నీ వారు వదలరు. కోట్లు విలువ చేసే హెరాయిన్ స్మగ్లింగ్ చేశారు. చాలా బాగా మేనేజ్ చేశారు. కానీ హైదరాబాద్ కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు మహిళా ప్రయాణీకులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. హెరాయిన్ ని తాము వెంట తెచ్చుకున్న ట్రాలీ బ్యాగ్…
దేశంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మత్తే ఆవహిస్తోంది. ఏపీ, తెలంగాణ అని తేడా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అవకాశాన్ని బట్టి డ్రగ్స్ దాచి పెట్టేస్తున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ డ్రగ్ దొరికిపోయింది. రూ 66 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను సీజ్ చేసింది కస్టమ్స్ బృందం. కెన్యా ప్రయాణీకుడి…