Drugs: తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తో పట్టుబడిన కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి భూపాలపట్నం దగ్గర గెస్ట్ హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీకి తాడేపల్లిగూడెంకు చెందిన యువకులు డ్రగ్స్ తీసుకుని వచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.. భూపాలపట్నంలోని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.