హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ బస్టింగ్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ వాడుతున్న పలువురిని పట్టుకున్నారు.
జైలులోనే డ్రగ్స్ దందాకు స్కెచ్ వేశారు. యస్.. మీరు విన్నది కరెక్టే. ఇద్దరు నైజీరియన్లు.. ముగ్గురు ఇండియన్స్ కలిసి డ్రగ్స్ దందాకు ప్లాన్ చేశారు. అంతే కాదు..జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. మళ్లీ అందరినీ కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర.హైదరాబాద్‌లో డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర ఉంటుంది. జైలులో ఒక్కటైన బిషప్, రోనాల్డ్…
తెలంగాణ పోలీసులు మరొకసారి తమ ధైర్య సహసాలను చూపెట్టారు.. వారం రోజులు పాటు డ్రగ్ మాఫియా అడ్డాలో పాగా వేశారు.. డ్రగ్ మాఫియాకు తెలియకుండానే వాళ్ళ గ్యాంగ్ లో చేరిపోయారు.. డ్రగ్ మాఫియా గ్యాంగ్ లోకి చేరిపోయి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు.. తెలంగాణ పోలీసులు చేసిన కోవర్ట్ ఆపరేషన్ కి గోవా మొత్తం దద్దరిల్లిపోయింది ..గోవాలో ఏకంగా ఆరు డ్రగ్ మాఫియా గ్యాంగులను పట్టుకున్నారు.. గోవా కేంద్రంగా హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించి…
వైసీపీ పై భూమా అఖిల ఫైర్ అయ్యారు.. వైసీపీ వెన్నుపోటు దినంతో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. తాజాగా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. "వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... మద్య నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచారు.. సొంత చెల్లిని, తల్లిని బయటికి గెంటేసి జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు.. రైతులకు, రాష్ట్రానికి…
గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.
డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్‌లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది..
Holi 2025: హైదరాబాద్ నగరంలోని దూల్‌పేట్‌లో హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో గంజాయితో తయారైన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బాదాం మిల్క్, స్వీట్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మత్తు పదార్థాల విక్రయంపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) బృందం దూకుడుగా దాడులు నిర్వహించి అనేక మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో హానికరమైన మత్తు పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.…
Human Trafficking : వరంగల్‌లో ఓ మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కిలేడీ గ్యాంగ్ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ పాశవిక దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత్తుమందులకు బానిసై, ఈజీ మనీ కోసం బలహీన స్థితిలో ఉన్న బాలికలను లొంగదీసే ఈ ముఠా ఘోరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆమె తనతో పాటు మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పరచుకుంది.…
Rachakonda CP: రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైనిక్‌పురిలో గ్యాస్ వ్యాపారం ముసుగులో హెరాయిన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ స్టవ్ విడిభాగాల ముసుగులో ఈ ముఠా హెరాయిన్‌ను సరఫరా చేస్తుండగా.. కన్స్యూమర్లకు ర్యాపిడో, ఓలా, ఉబేర్ వంటి రవాణా సేవల ద్వారా డ్రగ్స్ అందజేస్తున్నారని విచారణలో వెల్లడైందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ ముఠా చాలా కాలంగా…
డార్క్‌నెట్, క్రిప్టోకరెన్సీని ఉపయోగించిన పాన్-ఇండియా డ్రగ్ నెట్‌వర్క్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. ఈ వ్యవహరంలో ఆరుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.